స్పెషల్ డ్రైవ్ లో 123 వాహనాలు సీజ్

హైవే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో 123 వాహనాలు సీజ్ కావడం, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన 120 మంది పై కేసులు నమోదయ్యాయి.

Update: 2024-01-31 15:37 GMT

దిశ, భిక్కనూరు : హైవే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో 123 వాహనాలు సీజ్ కావడం, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన 120 మంది పై కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగంపల్లి శివారు 44వ జాతీయ రహదారి మొదలుకొని, బస్వాపూర్ గ్రామ శివారు వరకు గల హైవే తో పాటు, మండలంలోని గ్రామాలకు వెళ్లే ఇంటర్నల్ రోడ్లలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో పలు కేసులు నమోదయ్యాయి.

    నెంబర్ ప్లేట్లు లేకుండా, ఒకవేళ ఉన్నాసరిగా కనిపించకుండా ఉన్న ద్విచక్ర వాహనాలతో పాటు, ఆటోలు, లారీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కింద మొత్తం 123 వాహనాలను సీజ్ చేశారు. అదే విధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి 451 వాహనాలకు ఫైన్ లు వేశారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని పట్టుకొని 67 మందిపై కేసులు నమోదు చేశారు. హైవేపై నియంత్రణ లేని వేగంతో వెళ్తున్న 1746 వాహనాలకు పెద్ద మొత్తంలో చలానాలు రాశారు. ఈ విధంగా పోలీసులు కేసులు బుక్ చేస్తున్నా రాష్ డ్రైవింగ్ తో వాహనాలను నడుపుతూ ఎదురుగా వచ్చే వారితోపాటు పక్కా నుంచి వెళ్లే వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో జనవరి నెలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఆ విధంగా కేసులు నమోదు కావడం గమనార్హం.

రూల్స్ ప్రకారం నడుచుకోవాలి : ఎస్ఐ సాయికుమార్

ద్విచక్ర వాహదారులు తప్పకుండాహెల్మెట్ ధరించాలి. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించని వారే మృత్యువాత పడుతున్నారు. నెల రోజులపాటు ఈ స్పెషల్ కార్యక్రమాన్ని నిర్వహించాం. వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పక ఉండాలి. నెంబర్ ప్లేట్ లోని చివరి నెంబర్ ను కనిపించకుండా చేయడం, నెంబర్ ప్లేట్ ను వంచడం లాంటి పనులు చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా నిర్వహిస్తాం. రాష్ డ్రైవింగ్ చేసిన ఓవర్ స్పీడ్ వెళ్లిన, ట్రాఫిక్ నియమాలు పాటించకున్నా కఠిన చర్యలు తప్పవు. 


Similar News