పది రోజుల్లో హాస్టల్ విద్యార్థులకు కొత్త డైట్.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హాస్టల్ విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు.
దిశ, తెలంగాణ బ్యూరో : హాస్టల్ విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్ లో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పది రోజుల్లో కొత్త డైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. పెంచిన డైట్, కాస్మోటిక్ ఛార్జీలతో 7,65,705 మంది విద్యార్థులకు చేకూరనున్న ప్రయోజనం పొందనున్నారని సీఎం తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో శుక్రవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి తో మంత్రి సీతక్క బేటి అయ్యారు. మంత్రితో పాటుగా ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, సంజయ్ లు సీఎంను కలిసి డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఏడు సంవత్సరాల తర్వాత పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రకటించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం పెంచడం పై హర్షం వ్యక్తం చేశారు. అనంతం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల బాధలు తెలిసిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటం వల్ల విద్యా రంగ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయన్నారు. సంక్షేమ హాస్టల్, గురుకుల విద్యార్థులకు ఎప్పుడూ లేని విధంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతం మేర పెంచడం జరిగిందన్నారు. ఇదే విద్యార్థులకు అసలైన దీపావళి అని ఆమె తెలిపారు. ఏడేండ్లుగా డైట్ చార్జీలు, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్ చార్జీలు పెరగలేదని మంత్రి సీతక్క గుర్తు చేసారు. ఏడేళ్లుగా ధరలు విపరీతంగా పెరిగినా.. దానికి అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలు బీఆర్ఎస్ సర్కార్ పెంచలేదని, దీంతో పిల్లలు అర్ధాకలితో అలమటించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలనే ఉద్దేశంతో... పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక నుంచి హాస్టల్ విద్యార్థులు అర్థాకలితో అవస్థలు పడాల్సిన అవసరం లేదన్నారు. పెరిగిన డైట్ చార్జీలతో విద్యార్థులకు పోషకాహారం అందించాల్సిన బాధ్యత టీచర్లకు, హాస్టల్ సిబ్బందికి ఉందని గుర్తు చేసారు. విద్యార్థుల సమస్యలను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి, పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని గుడ్డిగా విమర్శిస్తుందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సహా పలు శాఖల కార్యదర్శులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దీపావళి కానుకగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని వసతిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచిన ప్రజా ప్రభుత్వం వారు హర్షం వ్యక్తం చేశారు. డైట్ చార్జీల పెంపు పై కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.