‘‘ఇక్కడ ఎకరానికి ఎన్ని కోట్లు సర్?’’.. కేటీఆర్‌ను ఘోరంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
కోకాపేట భూముల విషంయలో అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కోకాపేట భూముల విషంయలో అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గత అసెంబ్లీ సెషన్‌లో కోకాపేట భూముల విలువపై మాట్లాడిన కేటీఆర్.. హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని, కోకాపేట భూముల వేలంలో దేశంలోనే రికార్డు స్థాయి ధర పలికిందన్నారు. ఇంత అభివృద్ది జరుగుతున్నా ప్రతిపక్షాలు మాత్రం లేని పోని ఆరోపణలు చేస్తన్నాయని మంత్రి చేసిన కామెంట్స్‌ను తాజాగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కాలనీలలోకి నీరు చేరడంతో ఇళ్ల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరడంతో ఆ ప్రాంతం చెరువులను తలపిస్తున్నది. దీంతో ఇన్నాళ్లు హైదారాబాద్‌ను అభివృద్ధిలో పరుగులు పెట్టించామన్న కేటీఆర్ వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఒక్క రోజు వర్షానికే మొదటి అంతస్తు వరకు నీరు వచ్చి చేరిందని మరి ఈ ఏరియాలో ఒక ఎకరానికి ఎన్ని కోట్లు వస్తాయని సర్ అని కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా వేర్ ఈజ్ కేటీఆర్ అని యాష్ ట్యాగ్‌తో ఎక్స్( ట్వీట్స్) చేస్తున్నారు.