ఎట్లుండే కేసీఆర్.. ఎట్లైపాయే కదా..! కొడుకు, అల్లుడు దూరం? గులాబీ బాస్ ఫోటో వైరల్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కోలుకొని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గులాబీ బాస్, ఆయన టీం స్టేజీపై కుసున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫోటోపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
కొడుకుని కాస్త దూరంగా అల్లుడిని కాస్త దగ్గరగా
ఆ ఫొటోలో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించే తేడా ఏంటో గుర్తించండి? ఈ ఫోటోకు క్యాప్షన్ చెప్పండి అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫోటో పోస్ట్ చేస్తున్నారు. ‘ఒకరి ముఖంలోనూ కల లేదని, ఎట్లుండే కేసీఆర్ ఎట్లైపాయే’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘కొడుకుని కాస్త దూరంగా అల్లుడిని కాస్త దగ్గరగా ఉంచారు. కాకపోతే ఇద్దరినీ దూరంగపెట్టడమనేది మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశం’ అని తెలిపారు. ఎవరికి వారే యమునా తీరే వారు కుర్చున్నారని, సమన్వయ లోపం ఏర్పడిందా? అని నెటిజన్లు స్పందిస్తున్నారు. కేసీఆర్‌కు కడియం శ్రీహరి అవసరం ఉంది కాబట్టి పక్కన కూర్చోబెట్టుకున్నాడన్నారు. చేతులలో కంకణాల లాగా ఏదో కట్టుకునేది.. ఇప్పుడు లేనట్టుంది. అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఆ స్టేజీపై పూలగుత్తులు లేవు.. ఎసుంటి కేసీఆర్ ఎట్లైపాయెనో కదా అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.