అధికారుల నిర్లక్ష్యం.. ఫార్ములా-ఈ రేస్ పాస్‌ల కోసం గంటల తరబడి వెయిటింగ్!
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన నేడు ఫార్ములా- ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభంకానుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన నేడు ఫార్ములా- ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుండే అధికారులు పాస్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం మీడియా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ కార్యకర్తలతో పాటు పలువురు ప్రతినిధులు ఉదయం 9 గంటలకే పాస్‌ల కోసం ఐమాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ పార్కుకి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకే పాస్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సిన అధికారులు.. మధ్యాహ్నం కావస్తున్నా ఇంకా డోర్లు కూడా తెరవకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొట్టమొదటి సారి దేశంలోనే హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఏర్పాట్లలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని.. రెండు రోజుల పాటు సాగే కార్ల రేస్ ఏర్పాట్లలో అధికారులు బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.