బ్రేకింగ్: TSPSC పేపర్ లీకేజీ కేసులో ఈడీకి ఊహించని షాక్

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ తగిలింది.

Update: 2023-05-10 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ తగిలింది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ.. జైలులో ఉన్న నిందితులను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులు రేణుక, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్‌లను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో ఈడీ కోరింది.

నిందితుల నుండి వాంగ్మూలం నమోదు చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ ఈడీకి కౌంటర్‌గా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లపై బుధవారం నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జైలులో ఉన్న నిందితులను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ తరుపు న్యాయవాది వాదనతో నాంపల్లి కోర్టు ఏకీభవించలేదు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని.. ఈ అంశంపై ఈడీ తమ పరిధిలోని కోర్టును ఆశ్రయించాలని సూచిస్తూ.. ఈడీ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు డిస్మిస్ చేసింది. 

Tags:    

Similar News