కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వార్నింగ్..
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీలో సీఎం.కేసీఆర్ మీద కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీద అనుచితంగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దిశ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీలో సీఎం.కేసీఆర్ మీద కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీద అనుచితంగా మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి బాటలు వేసిన నిప్పులాంటి మనిషి, నిఖార్సయిన జగదీష్ రెడ్డి పై నోరు పారేసుకుంటే నాలుక చీరేస్తాం అని తెలిపారు. అలాగే కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్లగొండలో నిరుద్యోగ దీక్షకు వచ్చారన్నారు. మర్రిగూడా బైపాస్ లో వేయాల్సిన ఫ్లై ఓవర్ చర్లపల్లిలో వేసి 32 మంది ప్రాణాలు బలిగొన్న నీచుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండకు మణిహారంగా ఐటీ హబ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది, ఎన్జీ కలశాల భవనాలు నిర్మాణం అవుతున్నాయి.
నల్లగొండలో మెడికల్ కలశాల నిర్మాణం, బత్తాయి మార్కెట్, సమీకృత దుకాణాల సముదాయం లాంటి అబివృద్ది కళ్ళకు కనబడటం లేదా కోమటిరెడ్డి అన్నారు. తమ్ముడు కోసం కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతికి ద్రోహం చేసింది నువ్వు కాదా, నీకు డిపాజిట్ రాకుండా నిన్ను ఓడించడానికి బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధంగా ఉంది అన్నారు. రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం మీద గొంతు ఎత్తిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. నల్లగొండ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ నిరసన ర్యాలీ లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన బాషా సరిగా లేదు వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, బీర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.