కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖీ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

Update: 2024-12-30 17:33 GMT

దిశ,భూదాన్ పోచంపల్లి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖీ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా జనగాంకు చెందిన నర్ర నాగరాజు 13 సంవత్సరాల క్రితం కూలి పని చేసేందుకు మండలంలోని దేశ్ముఖి గ్రామానికి వచ్చి..రోజువారి కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి ఏడు సంవత్సరాల క్రితం మాధవి (25)తో వివాహం జరిగింది. వీరికి రెండు సంవత్సరాల కుమారుడు,10 నెలల కుమార్తె ఉంది. వీరిద్దరికీ తరచుగా గొడవలు జరుగుతుండడంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో మాధవి తన కుమారుడిని బయటకు వెళ్ళమని చెప్పి..ఉరి వేసుకుంది. గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా..మాధవి చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఎస్సై భాస్కర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.


Similar News