స్వర్ణగిరిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల..ఎప్పటినుంచంటే..?

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి మురళీకృష్ణ తెలిపారు.

Update: 2025-01-09 11:29 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి మురళీకృష్ణ తెలిపారు. గురువారం స్వర్ణ గిరి దేవాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు.. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తుల రద్దీ రీత్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాహనాల పార్కింగ్, లైటింగ్, క్యూ లైన్లు, తాగునీరు, టాయిలెట్స్, ఆన్లైన్ బుకింగ్స్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. టైం స్లాట్స్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు ఆలయానికి వచ్చి..వేచి ఉండే అవసరం లేదని వారికి స్లాట్ లో ఇచ్చిన టైం ప్రకారం వచ్చి దర్శనం చేసుకోవాలన్నారు. పది రోజులపాటు స్వామి వారు దశావతారాల్లో అలంకృతుడై భక్తులకు దర్శనమిస్తారన్నారు. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తునికి మహా ప్రసాదం, అన్న ప్రసాద కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు సంయమనం పాటించి దర్శనం చేసుకోవాలని కోరారు. ఆయన వెంట వ్యవస్థాపక ధర్మకర్త గోపికృష్ణ, స్వర్ణగిరి దేవాలయ పిఆర్ఓ సాయిబాబా, ప్రధాన అర్చకులు ఉన్నారు.


Similar News