కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వల్లనే గ్రామల్లో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు.
దిశ ,ఆత్మకూర్(ఎం) : కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వల్లనే గ్రామల్లో సుస్థిరమైన అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఆత్మకూర్ మెయిన్ రోడ్డు నుండి హైస్కూల్ వరకు డబుల్ రోడ్డు (1.75 కోట్ల నిధులతో) శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గోదావరి జలాలతో ఆత్మకూర్ వీర్ల చెరువు నిండడంతో.. చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆత్మకూర్ ప్రైమరీ స్కూల్ దగ్గర అంగన్వాడి భవనం (12 లక్షల నిధులతో)శంకుస్థాపన చేసి, విద్యార్థులతో మాట్లాడారు.మొరిపిరాల నుండి కాల్వపల్లి మీదుగా సింగారం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి, ముద్దసాని సిద్ధులు నరసింహ చారి, జన్నాయి కోడే నగేష్ ,కందడి అనంతరెడ్డి, బత్తిని ఉప్పలయ్య, కట్టెకోల హనుమంతు ,తండ శ్రీశైలం, పాశం వినోద,పోతగాని మల్లేష్ చిత్తార్ల అనిల్, గుండె గాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.