దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. లారీ డీజిల్ ట్యాంకర్‌కు గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో సూర్యాపేట కురాయగాయల మార్కెట్ చెందిన వెల్డింగ్ షాపు యజమాని పాల్వాయి అర్జున్(36), కుడకుడ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గట్టు అర్జున్(45)లుగా గుర్తించారు. కాగా, వెల్డింగ్ దుకాణా యజమానికి కుమారుడు, ఒక కూతురు ఉండగా, గట్టు అర్జున్‌కి ముగ్గురు కుమారులు ఉన్నట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు.