డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఆర్టీసీ బస్సు నడుపుతూ సందడి

ఆర్టీసీ బస్సులలో ప్రయాణమే సురక్షితం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-14 17:14 GMT

దిశ, మునుగోడు: ఆర్టీసీ బస్సులలో ప్రయాణమే సురక్షితం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గానికి కెటాయించిన 6 కొత్త బస్సులను ఆయన ప్రారంభించారు. ఆరు కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించి స్వయంగా ఆర్టీసీ బస్సును డ్రైవర్ స్థానంలో కూర్చొని నడిపారు. దీంతో మండల ప్రజలు, నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మునుగోడుకు ఆరు బస్సులు మంజూరు చేసిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. మునుగోడులో జూనియర్ కళాశాలు లేకపోవడంతో దూరం ప్రాంతాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థినీలకు బస్సులు లేక చదువు మద్యలోనే ఆపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణంతో బస్సులు సరిగ్గా లేక మహిళలు, పురుషులు ఇబ్బందులు గురువౌతున్నారన్నారు. ఇవ్వన్ని దృష్టిలో ఉంచుకొని సంబందిత మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఈ ప్రాంత నాయకులతో వెళ్లి 6 నెలల క్రితం బస్సులు కెటాయించాలని కోరితే 6 బస్సులు ఇచ్చారన్నారు. మునుగోడు అంటేనే పోరాటాల గడ్డ అని, గతంలో జరిగిన ధర్మ యుద్ధంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ పర్యటించేలా చేశామన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తన అంతిమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి నల్లగొండ జిల్లా చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి, డిప్యూటీ ఆర్ఎం శివశంకర్, డిఎం శ్రీనాధ్, అసిస్టెంట్ డిఎం హుసేన్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News