పత్తి మిల్లులో ప్రమాద వశాత్తు మధ్యప్రదేశ్ యువకుడు మృతి

పత్తి మిల్లు లో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఈ టూర్ గ్రామ పరిధిలోని శ్రీ శ్రీనివాస పత్తి మిల్లులో చోటు చేసుకుంది.

Update: 2024-12-14 16:51 GMT

దిశ, నాగారం: పత్తి మిల్లు లో జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఈ టూర్ గ్రామ పరిధిలోని శ్రీ శ్రీనివాస పత్తి మిల్లులో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి నెల రోజుల క్రితం సూర్యాపేట జిల్లా నాగారం మండలానికి కట్టే నానక్ రామ్ తండ్రి రామ్ లాల్ కట్టే (26) జీవనోపాధి కోసం వచ్చారు. రోజువారీగా పని ముగించుకుని కుటుంబ విషయంలో భార్యతో అన్నం విషయంలో గొడవపడి తాను రోజూ పడుకునే విధంగా పత్తి బేళ్లపై పడుకుని ఉండగా, మధ్య రాత్రి పత్తి బేళ్లు ప్రమాదవశాత్తు కూలిపోయాయి. దీంతో పత్తి బేళ్ల కింద పడి ఊపిరి ఆడక చనిపోయినాడు. మృతునికి కుమారుడు, భార్య ఉండగా.. ఈ ఘటనపై మృతుని భార్య కట్టే ప్రమీల భాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నాగారం ఎస్ ఐ ఎం.ఐలయ్య తెలిపారు.


Similar News