పత్రికా రంగంలో దిశ సంచలనం

దిశ అంటేనే పత్రిక రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని కనగల్లు ఎస్సై పి.విష్ణు అన్నారు.

Update: 2025-01-06 09:29 GMT

దిశ,కనగల్లు: దిశ అంటేనే పత్రిక రంగంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని కనగల్లు ఎస్సై పి.విష్ణు అన్నారు. సోమవారం కనగల్లు పోలీస్ స్టేషన్ లో దిశ దినపత్రిక నూతన సంవత్సర 2025 క్యాలెండర్లను ఎస్సై పి.విష్ణు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..పత్రికా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దిశ శ్రీకారం చుట్టిందని తెలిపారు. పత్రిక రంగానికి డిజిటల్ ఎడిషన్ కు పరిచయం చేసిన ఘనత దిశకే దక్కుతుందని ప్రశంసించారు. పత్రికా రంగంలో డిజిటల్, ప్రింటింగ్ విభాగంలో సమాచారాన్ని ప్రజలకు సులభంగా చేరవేస్తున్న దిశ పత్రిక సంచలమని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచడం అభినందనియమన్నారు. ఈ కార్యక్రమంలో దిశ కనగల్లు రిపోర్టర్ తొరకొప్పుల నాగరాజు,స్టేషన్ సిబ్బంది చెరుకు రమేష్,వెంకన్న, వెంకట్ రెడ్డి,సురేష్,స్వామి, పగిడిమర్రి మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వరికుప్పల రవి,దశరథ తదితరులు పాల్గొన్నారు.


Similar News