విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
దిశ, చౌటుప్పల్: తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో డైట్ చార్జీల పెంపు ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.మెస్ ఛార్జ్ ల పెంపు చేయడం ఆనందకరం అని,పిల్లలకు ఆహారం చాలా ప్రాధాన్యత అయిందని వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని టీచర్లకు సూచించారు.విద్యావిధానంలో అత్యంత ముఖ్యమైనది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇచ్చే శిక్షణ అని అన్నారు.వారి భవిష్యత్ తీర్చే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని గుర్తు చేశారు.పిల్లలకు విద్య పై అవగాహన కల్పిస్తూ క్రమశిక్షణతో ఉండాలని విద్యార్థులకు సూచించారు.