Breaking: చిన్నారులపై కూలిన గోడ.. తమ్ముడు మృతి.. అన్న పరిస్థితి విషమం

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్‌లో విషాదం చోటు చేసుకున్నారు...

Update: 2024-08-18 06:59 GMT

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్‌లో విషాదం చోటు చేసుకున్నారు. ఆడుకుంటున్న చిన్నారులపై ప్రహరీ గోడ కూలిపడింది. దీంతో తమ్ముడు హిమాన్షు అక్కడికక్కడే మృతి చెందారు. అన్న దేవాన్షు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. దండుమైసమ్మ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతుడు హిమాన్షు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలయం గోడ నానడంతో కూలిపోయినట్లు అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News