ఇచ్చట 2 వేల నోట్లు తీసుకోబడవు..
కేంద్రం తీసుకున్న చర్యల ఆధారంగా రెండువేల నోటు చూస్తేనే తుంగతుర్తి మండలంలోని పలువురు వ్యాపారులు జంకుతున్నారు.
దిశ, తుంగతుర్తి : కేంద్రం తీసుకున్న చర్యల ఆధారంగా రెండువేల నోటు చూస్తేనే తుంగతుర్తి మండలంలోని పలువురు వ్యాపారులు జంకుతున్నారు. ఈ నోట్లపై నిషేధ గడువు కాలం మరికొన్ని రోజుల పాటు ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం తమ కార్యకలాపాలను వాటి పై కొనసాగించడం మానేశారు. ముఖ్యంగా “మా వద్ద రెండువేల నోటు తీసుకోబడవు” అని పేర్కొంటూ ఇప్పటికే పెట్రోల్ బంకులతో పాటు కొన్నివ్యాపార దుకాణాల ముందు బోర్డులు వెలుస్తున్నాయి.
అయితే కొంతమంది తమవద్ద ఉన్న రెండువేల నోట్లను వివిధ రకాల నిత్యావసర సరుకుల కొనుగోలు ద్వారా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అవి చెల్లుబాటు కావడం లేదు. దీంతో వినియోగదారులు పలురకాలుగా విమర్శలు చేస్తూ వెనుతిరిగిపోతున్నారు. ఇక రెండువేల నోట్ల మార్పిడికి మండల కేంద్రంలోని ఎస్బీఐ కూడా కొన్నిషరతులను విధిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.