tribals : రోడ్డు పై గిరిజనుల ధర్నా రాస్తారోకో..

గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ పేరుతో నిర్మించ తలపెట్టిన భవనానికి నేటికి కూడా స్థలం కేటాయించనందుకు నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గిరిజనులు రాస్తారోకో, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

Update: 2024-10-27 08:37 GMT

దిశ, తుంగతుర్తి : గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ పేరుతో నిర్మించ తలపెట్టిన భవనానికి నేటికి కూడా స్థలం కేటాయించనందుకు నిరసనగా నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం గిరిజనులు రాస్తారోకో, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ గత శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ కృషి మేరకు అప్పటి ప్రభుత్వం తుంగతుర్తిలో బంజారా భవనాన్ని మంజూరు చేసిందని తెలిపారు. దీని నిర్మాణానికి రూ.కోటిన్నర నిధులను కూడా మంజూరి చేయగా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని వివరించారు.

అయితే నూతన ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు పూర్తయినప్పటికీ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంలో నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. వెంటనే స్థలాన్ని కేటాయించే విధంగా ప్రభుత్వం రెవెన్యూ అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుండగానీ రాములు, మాజీ ప్రజా ప్రతినిధులు విరోజీ నాయక్, నరేష్ నాయక్, యాకు నాయక్, పుణ్య నాయక్, శంకర్ నాయక్, క్రాస్ రోడ్డు తండా మాజీ సర్పంచ్ వెంకన్న నాయక్, పులాని, గాజుల యాదగిరి, మట్టిపెల్లి వెంకట్, చింతకుంట్ల మనోజ్, ఉప్పల నాగమల్లు, మల్లికార్జున, సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News