Chamala : మోడీ సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తే మంచిది.. కానీ రేవంత్ మూసీని చేస్తే అడ్డు.. ఎంపీ చామల ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోడీ సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తే మంచిది.. రేవంత్‌రెడ్డి మూసీని ప్రక్షాళన చేస్తే అడ్డుపాడుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-10-27 11:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు బండిసంజయ్, కిషన్‌రెడ్డి, ఈటల‌రాజేందర్ మాట్లాడుతారు.. ప్రధాని మోడీ సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తే మంచిది.. రేవంత్‌రెడ్డి మూసీని ప్రక్షాళన చేస్తే అడ్డుపాడుతున్నారని MP Chamala Kiran Kumar Reddy ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అడ్డగూడూర్ మండలం మానాయకుంట గ్రామంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి మూసీ రైతుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు మంచి చేయాలని, మురికి కూపంలో బతుకుతున్న ప్రజలకు దారి చూపాలి అన్న ఆలోచనతోనే Revanth Reddy ప్రతిష్టాత్మకంగా Musi River మూసీ ప్రక్షాళన కార్యక్రమం తీసుకున్నారని అన్నారు.

పేద ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ప్రతిపక్ష పార్టీలు కేవలం ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడం లక్ష్యం గా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తుండే విధంగా ఒక ఆధునిక సిటీగా హైదరాబాద్ ని తీర్చి దిద్దుతుంటే దరిద్రపు ఆలోచనతో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కమీషన్‌లు తినే అలవాటు మీది, కమీషన్‌లకు అలవాటు పడ్డ మీకు నిద్ర పడుతలేదని ప్రతిపక్షాలను విమర్శించారు. మంచి పని చేసేటప్పుడు మంచి మాట్లాడాలి కానీ చిల్లర మాటలు చిల్లర చేష్టలు చేయకండని వారికి సూచించారు. హైదరాబాద్ కి బెంగళూరు చెన్నై నగరాల పరిస్థితి రావద్దు అని ముందు చూపుతో చేస్తుంటే.. సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మూసీ నది మీద ఎంతో మంది ప్రజలు, రైతులు ఆధారపడి ఉన్నారని, కానీ ఆ కాలుష్యం వల్ల పండించే పంట అమ్ముకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మూసీ ప్రక్షాళనకు మీ సపోర్ట్ అవసరం

పదేళ్లలో వాళ్ళు చేయలేనిది మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఓర్వలేక పోతున్నారని, ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఇది సుందరీకరణ కోసం కాదు.. ఇది మూసీ పునరుజ్జీవనం కోసం.. మూసీ మురికి నుంచి ప్రజలను కాపాడాలనేదే మా ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నమని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీళ్లు తెచ్చి మూసిని సస్యశ్యామలం చేస్తామన్నారు. Farm House ఫామ్‌హౌస్‌లో పడుకుని మాజీ సీఎం కేసీఆర్ KCR కాళేశ్వరం కట్టాడని విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్, న్యూయార్క్, లండన్ చేస్తా అన్నాడు ఇంట్లో పడుకుంటే అయితదా..? అని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల సంక్షేమం మీకు పట్టవు.. రైతులను కాపాడడం కోసం దీపావళి తర్వాత నకిరేకల్ లో, చివరగా ఇబ్రహీంపట్నంలో లక్ష మందితో సభలు పెడుతామన్నారు. అవసరం అయితే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మీ రైతులందరికీ విన్నపం చేస్తున్న మూసీ ప్రక్షాళన చేయాలంటే మీ సపోర్ట్ అవసరం ఉందన్నారు. పరివాహక రైతులందరూ మూసీ నది ప్రక్షాళనకు Farmers మద్దతు ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..