MLA Vemula Veeresham : మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి...
మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం( MLA Vemula Veeresham )తెలిపారు.
దిశ, నార్కట్ పల్లి : మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం( MLA Vemula Veeresham )తెలిపారు. కుట్టు శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. నార్కట్ పల్లి పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం..ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత దక్కేది కాదన్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఇద్దరు మహిళలకు చోటు ఇచ్చి గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలంతా సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. అంతకుముందు పట్టణంలో గూడూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో.. నిర్వహించే కేబుల్ నెట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూదిమెట్ల సత్తయ్య,వడ్డే భూపాల్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల భరత్, పుల్లెంల అచ్చాలు, సట్టు సత్తయ్య, బోడ శంకర్, వేముల నరసింహ, జిల్లా చిన్న, తదితర నాయకులు పాల్గొన్నారు.