డిసెంబరు 5లోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లును డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-11-28 15:59 GMT

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లును డిసెంబర్ 5లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో డిసెంబర్ 5 లోగా కొనుగోళ్ళను పూర్తి చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని అన్నారు. అదేవిధంగా జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.


Similar News