Musi పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం సభ.. మద్దతు‌గా పాల్గోన్న ఎమ్మెల్యే వేముల

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన "మూసీ పునర్జీవం మద్దతుగా.. ఆదివారం అడ్డగుడూరు మండలం మనాయి కుంట గ్రామంలో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి" మూసీ(కMusi) పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం సభ" (Musi District Farmers' Spiritual Association Meeting) నిర్వహించారు.

Update: 2024-10-27 11:06 GMT

దిశ, వెబ్ డెస్క్: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన "మూసీ పునర్జీవం మద్దతుగా.. ఆదివారం అడ్డగుడూరు మండలం మనాయి కుంట గ్రామంలో తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి" మూసీ(కMusi) పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనం సభ" (Musi District Farmers' Spiritual Association Meeting) నిర్వహించారు. ఈ సభకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Viresham), ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాట్లాడుతూ.. మూసి కాలుష్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా తీవ్రంగా నష్టపోతుందని, మూసి పునర్జీవంతో నల్లగొండ జిల్లా ప్రాంతాన్ని కాలుష్యం నుంచి విముక్తి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల పిలుపునిచ్చారు. అలాగే మూసీ సుందరీకరణ పథకం పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. అలాగే అనవసర రాదాంతాలు మానుకొని.. మూసి ప్రాంత బాధితులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే వీరేశం సందర్భంగా పిలుపునిచ్చారు.


Similar News