BRS: మహిళా రిపోర్టర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం.. ఇదేమిటని ప్రశ్నించడంతో క్షమాపణలు

మహిళ రిపోర్టర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ర సంజయ్ కుమార్(Kalvakuntla Sanjay kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-10-27 13:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళ రిపోర్టర్ పై కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ర సంజయ్ కుమార్(Kalvakuntla Sanjay kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జర్నలిస్టులు(Journalists) ఎదురుతిరగడంతో క్షమాపణలు(Sorry) చెప్పారు. జన్వాడ ఫామ్ హౌజ్(Janwada Form House) రేవ్ పార్టీ కేసు నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు(Excise Offiecers) రాజ్ పాకాల(Rajpakala) విల్లాలో సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు. దీంతో బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) అక్కడికి చేరుకొని అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా.సంజయ్ ను ఓ టీవీ చానెల్ కు చెందిన మహిళా రిపోర్టర్ ప్రశ్నించింది. దీనిపై ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. "మీ ఇంట్లో మందు తాగరా..? మీది తెలంగాణ సమాజమేనా..? మీరు తెలంగాణకు సంబంధించిన వారేనా..?" అంటూ.. ఏం మాట్లాడుతున్నారు..? అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న తోటి జర్నలిస్టులు సంజయ్ కుమార్ పై తిరగబడ్డారు. జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఇలాగేనా మాట్లాడేది అని ప్రశ్నించారు. మహిళా జర్నలిస్ట్ అని చూడకుండా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా ఎందుకు ఆగ్రహిస్తున్నారని నిలదీశారు. దీంతో సంజయ్ కుమార్ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. అంతేగాక మీడియా ముఖంగా తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News