ఆందోల్ ఏరియా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Minister Damodar Raja Narasimha) తన సొంత నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా (Minister Damodar Raja Narasimha) తన సొంత నియోజకవర్గంలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా.. ఆందోల్ పట్టణంలో ఉన్న ఏరియా ఆస్పత్రిని( Andole Area Hospital) ఆకస్మికంగా పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లతో మాట్లడి ఆస్పత్రి స్థితిగతులను తెలుసుకున్నారు. అలా కొద్దిసేపు ఆస్పత్రిలోని అన్ని వార్డులో కలియతిరిగిన మంత్రి దామోదర రాజనర్సింహ.. ఏరియా ఆస్పత్రి ఆధికారుల(Hospital authorities)తో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఆందోల్ ఏరియా ఆస్పత్రిని అన్ని విధాలుగా బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.