కొద్దిపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న దారి

మండలం లో నగర దుబ్బ తండా నుంచి తవక్లాపుర్ వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికే చిత్తడి గా మారుతుంది.

Update: 2024-10-17 12:45 GMT

దిశ, డిండి: మండలం లో నగర దుబ్బ తండా నుంచి తవక్లాపుర్ వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికే చిత్తడి గా మారుతుంది. దీంతో ఈ దారిలో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ చక్రవర్తి తెలిపారు. ఈ రహదారి గుండా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు గిల్లలు జారి కింద పడిపోయి గాయాల పాలవుతున్నారన్నారు. అలాగే దారి మధ్యలో ఏర్పడిన గుంతలలో వర్షపు నీరు నిలవడంతో ఆ దారి గుండా ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడుతున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని, రహదారిని బాగు చేయాలని ఆయన కోరారు.


Similar News