రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు: ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు.

Update: 2024-10-17 12:58 GMT

దిశ, నకిరేకల్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయని రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్ కట్టంగూర్, నార్కట్‌పల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందన్న విషయాన్ని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. అదేవిధంగా త్వరలో రైతుబంధు అందించనున్నట్లు తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో పాటుగా వచ్చే జనవరి మాసం నుంచి సన్న బియ్యానికి అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను సైతం అందించనున్నట్లు తెలిపారు.

ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఇబ్బందులు ఏర్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులకు ఇబ్బందులు జరిగినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తప్ప ఉన్నారు. ప్రజలకు లబ్ధి చేకూరిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. గత పదేళ్లలో దోచుకున్నది సరిపోయినట్లు మళ్లీ రాద్ధాంతాలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తామనే కలలు కలలుగానే మిగిలిపోతాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, నాయకులు బాచుపల్లి గంగాధర్ రావు, దూదిమెట్ల సత్తయ్య, బండ సాగర్ రెడ్డి, సట్టు సత్తయ్య, జేరిపోతుల భరత్ గౌడ్, నేతగాని కృష్ణ, గడ్డం పశుపతి, గడుసు శశిధర్ రెడ్డి, రేగట్టే శంకర్ రెడ్డి, అలుగుబెల్లి వివేకానంద రెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు.


Similar News