ఆ నాయకుడి వల్ల అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు.. ప్రమాదకరంగా బక్కమంతుల గూడెం చెరువు కట్ట

ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల మఠంపల్లి మండలంలోని బక్క మంతుల గూడెం, చౌటపల్లి, చెన్నాయిపాలెం, మఠంపల్లి యాతవాకిళ్ళ గ్రామాలకు చెందిన చెరువు కట్టలు తెగిపోయాయి.

Update: 2024-10-17 15:15 GMT

దిశ, మఠంపల్లి: ఇటీవల కాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల మఠంపల్లి మండలంలోని బక్క మంతుల గూడెం, చౌటపల్లి, చెన్నాయిపాలెం, మఠంపల్లి యాతవాకిళ్ళ గ్రామాలకు చెందిన చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో పూర్తిగా వరి పంటలు నీటిలో కొట్టుకుపోయి మేటలు వేయడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గండి పడిన చెరువులను పరిశీలన చేసి ఆన్లైన్ ద్వారా టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగటం జరిగింది. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే ఆయా కంపేనిలు పనులు ప్రారంభించగా బక్కమంతుల గూడెం చెరువు కట్ట పనులు మాత్రం నిలిచి పోయాయి.

దీనికి కారణం ఓ రాజకీయ నాయకుడని.. ఆయన మంత్రికి దగ్గరి శిష్యుడు‌గా షోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ.. చెరువు కట్ట పూడ్చివేతకు.. ఆన్లైన్‌లో టెండర్ దక్కించుకున్న సంస్థ వారిని భేదిరిస్తూ.. తానే ఆ పని చేస్తానని, సదరు సంస్థకు కమిషన్ ఇస్తానని చెప్పడంతో ఇప్పటి వరకు పనులు మొదలు కానట్లు తెలుస్తుంది.. గ్రామానికి వెళ్లే చెరువు కట్ట ఎనిమిది చోట్ల పూర్తిగా ధ్వంసం కావడం తో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి‌కి మచ్చ రాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.


Similar News