గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికే సీఎం కప్: మంత్రి కోమటిరెడ్డి

తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Update: 2024-10-17 14:03 GMT

దిశ, నల్లగొండ: తమ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy) వెంకటరెడ్డి అన్నారు. గ్రామీణ క్రీడాకారులలో క్రీడల పట్ల అవగాహన కల్పించి, క్రీడలను పెంపొందించేందుకు ఉద్దేశించి చేపట్టిన సీఎం కప్పు క్రీడల్లో భాగంగా టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి క్లాక్ టవర్ వద్ద టార్చ్ ర్యాలీ జ్యోతిని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక సామర్థ్యం తో పాటు, మానసిక సామర్థ్యం పెరుగుతుందని, ప్రత్యేకించి విద్యార్థులు చదువుతో పాటు, క్రీడల్లో పాల్గొనాలని మంత్రి అన్నారు. క్రీడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు ఉంచేందుకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగా వివిధ రకాల క్రీడలలో పతకాలు పొందిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలతో పాటు, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం క్రీడా‌కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సి .నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని టార్చ్ ర్యాలీని అందుకున్నారు.


Similar News