కలెక్టరేట్ ముందు ధర్నా చేయనున్న పెన్షనర్లు..

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 10న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం రాష్ట్ర కౌన్సిలర్ ఓరుగంటి సత్యనారాయణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డిలు తెలిపారు.

Update: 2023-04-09 09:47 GMT

దిశ, తుంగతుర్తి : దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 10న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం రాష్ట్ర కౌన్సిలర్ ఓరుగంటి సత్యనారాయణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కేతిరెడ్డి రవీందర్ రెడ్డిలు తెలిపారు.

ఆదివారం తుంగతుర్తిలో ఆ సంఘం నేత పాలవరపు సంతోష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులలో నగదు రహిత వైద్య చికిత్సలు అమలు చేయాలని, బకాయి పడ్డ 3 డీఆర్ లను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను నుండి మినహాయిస్తూ క్వాంటంను 70కి బదులు 65 ఏళ్లకు అమలు చేయాలని కోరారు. పెన్షన్ కమ్యూటేషన్ ను 15 బదులు 12 ఏళ్లకు కుదించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పులుసు పుల్లయ్య, కార్యదర్శి దాసు, ఉపేందర్, కోశాధికారి సంపత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News