మంత్రి ఎదుటే కాలర్లు పట్టుకున్న బీఆర్‌ఎస్ నాయకులు..

నెమ్మికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గృహలక్ష్మీ లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి శనివారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

Update: 2023-09-30 10:13 GMT

దిశ , సూర్యాపేట: నెమ్మికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గృహలక్ష్మీ లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి శనివారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అయితే ఈ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారుల ముందే రసాభాస జరిగింది. బీఆర్‌ఎస్ నాయకులు కొట్టుకున్నారు. కందగట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారుల ముందే కాలర్‌లు పట్టుకున్నారు.


కందగట్ల గ్రామ సర్పంచ్ ముద్దం శేషమ్మ కుమారుడు మధుసూదన్ రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ పాటించకుండా లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేయడంతో పాటు ఆయన వర్గానికే ఇళ్లను మంజూరు చేశారని ఆగ్రహించారు.


 పీఎసీఎస్ వైస్ చైర్మన్ బొల్లే జానయ్య స్టేజిపైనే ఆయన ప్రశ్నిచడంతో ఊగిపోయిన మధుసూదన్ రెడ్డి తన సహచరులతో ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అంతకు ముందే ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు తాము ఇళ్లకు పూర్తి అర్హులమని తెలిసిన్నప్పటికి తమకు అందలేదని మంత్రి వద్దనే మొర పెట్టుకున్నారు. కాగా ఇల్లు రానివారి ఎవరైనా ఉంటే తమ క్యాంపు కార్యాలయానికి వచ్చి కలవాలని మంత్రి సూచించినట్లు భాదితులు వెల్లడించారు.

గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులను నిలదీత..

ఆత్మకూర్(ఎస్) మండలంలోని కొత్త తండా కు చెందిన్న గృహాలక్ష్మి పథకంలో ఇల్లు ఉన్న వారికే కేటాయించారంటూ రోడ్డును అడ్డగించి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పై తిరగబడిన మహిళలు. అంతకు ముందు పాతర్ల పహాడ్ స్టేజి వద్ద కూడా అర్హులని చెప్పుకొంటున్న వారు రోడ్డుపై ముళ్ల కంపలు వేసి తమ ఆందోళన చేశారు.


Similar News