కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మొద్దు : తాటికొండ సీతయ్య
జాతీయ పార్టీ అంటూ చెప్పుకునే కాంగ్రెస్ ఇంకా ప్రజలను మోసపూరిత ప్రకటనలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు.
దిశ, తుంగతుర్తి : జాతీయ పార్టీ అంటూ చెప్పుకునే కాంగ్రెస్ ఇంకా ప్రజలను మోసపూరిత ప్రకటనలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం ఆయన తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ నిర్వహించిన తుక్కుగూడ సభలో నేతలు చెప్పుకొచ్చిన హామీలను ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పై శ్రద్ధలేని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక అవి గుర్తొచ్చాయా...? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ మోసపూరిత పార్టీగా గుర్తించే ప్రజలు దాన్ని పక్కకు పెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే దిక్కని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు పోతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఎవరు ఎన్ని విమర్శలు చేసిన పట్టించుకునే స్థితిలో ప్రజల లేరని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమైపోయిందని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకుంటే మంచిదని సూచించారు.