నందికొండలో మున్సిపల్ కౌన్సిలర్లకు షాక్.. అవిశ్వాసం తీర్మాణంపై హైకోర్టు స్టే
నియోజకవర్గ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.
దిశ, నాగార్జునసాగర్ : నియోజకవర్గ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. నందికొండ మున్సిపాలిటీకి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాణాన్ని కలెక్టర్‌కి అందజేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. నందికొండ మునిసిపాలిటీలో మొత్తం 11 మంది కౌన్సిలర్లు ఉండగా.. బీఆర్‌ఎస్‌కు ఏడుగురు ఉన్నారు. అందులో నలుగురు కాంగ్రెస్‌కు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్లు మొత్తం 11 మంది చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని గతంలో రెండు సార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అవిశ్వాసంపై చర్చించేందుకు జనవరి 6న అంటే నేడు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస బల నిరూపణ ప్రక్రియ నిలిచిపోయింది. సదరు కౌన్సిలర్లు అవిశ్వాసం నిలిచిపోవడానికి కారణం ఏంటని, కోర్టు ఉత్తర్వులు వచ్చినట్లు ఒక రోజు ముందు ఎందుకు తెలుపలేదంటూ వారు ప్రశ్నించారు.