బీఆర్ఎస్, బీజేపీలకు వరుస షాక్ లు...

సూర్యాపేటలో బహుజన వాదనికి రోజు రోజు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ అన్నారు.

Update: 2023-10-30 15:57 GMT

దిశ, సూర్యాపేట: సూర్యాపేటలో బహుజన వాదనికి రోజు రోజు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ కుంభం అనిత నాగరాజులతో పాటు బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మీర్ అక్బర్ దంపతులు, టూ వీలర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ లతో సుమారు 500 మంది సోమవారం బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూర్యాపేటలో గడిచిన 75 ఏళ్లలో అగ్రవర్ణ నాయకులు బహుజనులు ఓట్లతో గెలిచి పెత్తనం చేలాయిస్తున్నారని ఆరోపించారు. అందుకు ఇప్పుడు మనమంతా బహుజన వాదాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వస్తే బ్రతుకులు మారుతాయని కేసీఆర్ మాటలు నమ్మి ఆత్మ బలిదానాలు చేసుకున్న బహుజన యువతకు 10 ఏళ్లలో ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. తెలంగాణ రాక ముందు కాంగ్రెస్ దొరలు పాలిస్తే తెలంగాణ వచ్చాక కూడా బీఆర్ఎస్ దొరలు బహుజనులను పాలిస్తున్నారని విమర్శించారు.

2014 తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్ని ఆస్తులు కూడకోట్టుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఎస్పీ కార్యాలయం ముందు ఫ్లెక్సీలను చించాలని కొంతమంది ఆదేశాలు ఇస్తున్నారని, చిల్లర చేష్టలతో దాడులు చేస్తే జనం ఊరుకోబోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బుడిగే మల్లేష్ యాదవ్, చాంద్ పాష, వల్లాల సైదులు, ఉదయ్, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News