పలు రైళ్లు ఆపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి

రామన్నపేటలో డెమో, నారాయణాద్రి రైళ్ళను ఆపాలని శుక్రవారం

Update: 2024-12-27 08:13 GMT

దిశ,రామన్నపేట : రామన్నపేటలో డెమో, నారాయణాద్రి రైళ్ళను ఆపాలని శుక్రవారం రామన్నపేట ప్రయాణికులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రామన్నపేటలో డెమో, నారాయణాద్రి రైళ్లను ఆపాలని వినతి పత్రంలో కోరారు. ఎందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని రైళ్లు ఆపే విధంగా కృషి చేస్తానని తెలిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దామెర అంజయ్య, బండారపు కృష్ణ, రేవల్లి విజయ్ కుమార్, మల్లేష్, శ్రీకాంత్, నారాయణ, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.


Similar News