Collector Tejas Nand Lal Pawar : విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి..
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్యులకు సూచించారు.
దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వైద్యులకు సూచించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, చివ్వేంల కేజీబీవీని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, డైరెక్టర్ అర్చన సురేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలకు విద్య, వైద్యంలలో అత్యవసర సదుపాయాలను కల్పించటానికి కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులతో వసతులు కల్పించటానికి పర్యటించినట్లు ఆమె తెలిపారు.
మొదటగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోని ఫార్మసి, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లు, చిన్న పిల్లల వార్డ్, డయాలసిస్, ఎమర్జెన్సీ వార్డ్ లను సందర్శించి అక్కడ ఉన్న రోగులతో చికిత్స ఎలా అందుతున్నాదో అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లు, స్టాప్ నర్సులతో అత్యవసర పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చివ్వేంల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో హస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ గురురాజ్, డాక్టర్ జనార్దన్ డీఈఓ ఆశోక్, కేజీబీవీ ప్రిన్సిపల్ నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.