Pusa Balakishan : ఎంపీని విమర్శించే స్థాయి చిరుమర్తికి లేదు.. పూస బాలకిషన్

భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నకిరేకల్ మాజీ ఎం‌ఎల్‌ఏ చిరుమర్తి లింగయ్యకు లేదని కాంగ్రెస్ జిల్లా నాయకులు పూస బాలకిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Update: 2024-11-06 07:24 GMT

దిశ, రామన్నపేట : భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నకిరేకల్ మాజీ ఎం‌ఎల్‌ఏ చిరుమర్తి లింగయ్యకు లేదని కాంగ్రెస్ జిల్లా నాయకులు పూస బాలకిషన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం పై పని కట్టుకొని బురద సళ్లే ప్రయత్నణంలో ప్రతిపక్ష నాయకులు వున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ ప్రజలు చిత్తుగా ఓడించిన లింగయ్యకు బుద్ధి రాలేదన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News