ఆర్ఓఆర్ చట్టంలో ప్రజల అభిప్రాయమే కీలకంః గుత్తా సుఖేందర్ రెడ్డి

Update: 2024-08-24 09:25 GMT

దిశ, నల్లగొండః ఆర్వోఆర్ చట్టంలో ప్రజల అభిప్రాయమే కీలకం అని.. కాబట్టి వారి అభిప్రాయాన్ని నిష్పక్ష పాతంగా సేకరిస్తామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్ ఓ ఆర్ చట్టంపై చర్చ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో మేధావులు, పలు రాజకీయ నాయకులు, రైతులు, అధికారుల సమక్షంలో నిర్వహించారు. కొత్తగా వస్తున్న ఆర్ ఓ ఆర్ చట్టం 2024కు గతంలో ఉన్న 2020 భూచట్టంలో సమూల మార్పులు తేవడానికి శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. ఈ చర్చ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ చట్టంలో పొందపరుచుకునే అంశాలను ప్రజల వద్ద నుండి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అన్నారు. ప్రతి వ్యక్తికి కలిగిన ఇబ్బందులను పరిష్కారం చేసుకునే అవకాశం ఉండాలి కానీ గత 2020 చట్టంలో అలాంటి అవకాశం లేదన్నారు. 2024 చట్టంలో పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉందని తెలిపారు.

నల్లగొండ జిల్లాలో 22 వేల ధరణి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయన్నారు. ఏ స్థాయిలో జరిగే పని అక్కడ జరిగితే బాగుంటుంది అని ఈ కొత్త చట్టం లో వెసులుబాటు ఉంది అన్నారు. దొంగ పాసు పుస్తకాలు చాలా ఉన్నాయని.. వాటన్నింటినీ తొలగించాలి అని పైలట్ ప్రాజెక్టుగా సాగర్ తిర్మలగిరి ఎంపిక చేసి ఆర్ఓఅర్ చట్టం 2024 తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆర్ ఓ ఆర్ చట్టం 20 సెక్షన్లు ఉన్నది అని దాని గురించి వివరించారు. ప్రజలు సలహాలు, సూచనలు ఫిర్యాదులను లేఖల రూపంలో ఇచ్చినా తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సి రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Similar News