ఎస్ ఈ కార్యాలయం ముందు నిరసన

విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం ముందు 1104 యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.

Update: 2024-12-13 13:24 GMT

దిశ,నల్లగొండ బ్యూరో : విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం ముందు 1104 యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టిఈఈ 1104 యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్ వెంకటయ్య, టిజిపిఈఏ నాయకులు నవీన్ మాట్లాడుతూ..విద్యుత్ ప్రవేటికరణ చర్యలకు వ్యతిరేకంగా నిరసన చర్యలు చేపట్టాలని ఎన్ సిసిఓఈఈఈ పిలుపునివ్వడం అభినందనీయమన్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ చండీగఢ్ విద్యుత్ సంస్థలను ప్రవేశికరించే యత్నానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల తీరును వ్యతిరేకిస్తూ..ఎస్ ఈ కార్యాలయంవిద్యుత్తు ఉద్యోగులు చేసిన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందేనని అన్నారు. విద్యుత్ ఉద్యోగులంతా ఐక్యతతో సంస్థ రక్షణ మనందరి ధ్యేయంగా భవిష్యత్ పోరాటలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శంకర్ అన్నయ్య వివిధ సంఘాల నాయకులు పి రాంబాబు విశ్వం గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Similar News