యువత క్రీడల్లో రాణించాలి

యువత చదువుతోపాటు క్రీడలల్లో రాణించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2024-12-13 15:15 GMT

దిశ, మిర్యాలగూడ : యువత చదువుతోపాటు క్రీడలల్లో రాణించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల నుండి క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులు,యువత క్రీడలు పై దృష్టి సారించి..ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు అధికారులు పాల్గొన్నారు.


Similar News