చిట్యాలలో వ్యక్తి దారుణ హత్య..
చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని చిట్యాల పోలీసులు ఉదయం గుర్తించారు.
దిశ, చిట్యాల : చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి 65 నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో మృతి చెంది ఉన్న వ్యక్తిని చిట్యాల పోలీసులు ఉదయం గుర్తించారు. మృతుని వద్ద లభించిన ఉద్యోగి గుర్తింపు కార్డు ఆధారంగా మృతుడు ఆర్ఎస్వీ ప్రసాద్ (సుమారు 50) హైదరాబాద్ లోని గాంధీనగర్ లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.
గుర్తు తెలియని వ్యక్తులు ఇతనిని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని దుండగులు అక్కడే వదిలి వెళ్లిపోయారు. స్థానికులచే సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన వివరాలు, హత్య చేసిన వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.