వికలాంగుల రాస్తారోకో... పెండ్లికాని వాళ్లకు సైతం కేటాయించారని ఆగ్రహం

మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ... Protest at Miryalaguda

Update: 2023-03-04 05:58 GMT
వికలాంగుల రాస్తారోకో... పెండ్లికాని వాళ్లకు సైతం కేటాయించారని ఆగ్రహం
  • whatsapp icon

దిశ, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పేదలు, వికలాంగులు శనివారం కోదాడ-జడ్చర్ల రహదారిపై రాస్తారోకో చేశారు. ఆందోళనకు పెద్ద సంఖ్యలో మహిళలు వికలాంగులు హాజరవగా వన్ టౌన్ పోలీసులు బందోబస్త్ చేపట్టారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్షకత పాటించలేదని, సొంతం ఇండ్లు ఉన్నవారికి ఉద్యోగస్తులకు ఇండ్లు కేటాయించి పేదలకు అన్యాయం చేసినట్లు వాపోయారు. పెండ్లి కాని వాళ్లకు సైతం ఇండ్లు కేటాయించడం దారుణం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్హులైన పేదలు వికలాంగులకు ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News