నేరేడుచర్లలో మున్సిపాలిటీ అధికారుల తీరే.. డిఫరెంట్..

ఇంటి పన్నులు చెల్లించకుండా జాప్యం చేస్తూ మున్సిపల్ అధికారులు

Update: 2025-03-28 04:02 GMT
నేరేడుచర్లలో మున్సిపాలిటీ అధికారుల తీరే.. డిఫరెంట్..
  • whatsapp icon

దిశ,నేరేడుచర్ల : ఇంటి పన్నులు చెల్లించకుండా జాప్యం చేస్తూ మున్సిపల్ అధికారులు ఇబ్బందులు పెడుతున్న ఇంటి యజమాని ఇంటి ముందు మున్సిపల్ అధికారులు ధర్నా చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డు లో నివాసం ఉంటున్న బానోతు భీమా 2015-16 సంవత్సరం నుంచి ఇంటి పన్ను చెల్లించకుండా బకాయి పడ్డారని చెల్లించకుండా మున్సిపల్ అధికారులు సిబ్బంది ఇబ్బందులు గురిచేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి తన అధికారులు సిబ్బందితో వెళ్లి ఇంటి ముందు ధర్నా ఇంటి పన్ను చెల్లించకుండా అధికారుల సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్నారని ఎప్పుడు వెళ్ళి అడిగిన కడతాం లే ..అంటూ దాటవేస్తున్నారని ప్రతిసారి వెళ్లి అడిగినప్పుడల్లా రహదారి సౌకర్యం లేదని, డ్రైనేజీ సౌకర్యం లేదని ఏదో ఒక సాకుతో పన్ను చెల్లించకుండా జాప్యం చేస్తున్నట్లు తెలిసింది.

ఇటీవల బాగా ఒత్తిడి చేయగా 3 వేయిలు పన్ను చెల్లించాడని ఇంకా రూ.27,542 ఇంటి పన్ను బకాయి ఉండగా ప్రభుత్వం కల్పిస్తున్న 90 శాతం వడ్డీ రాయితీని ఉపయోగించుకుని చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నప్పటికీ చెల్లించడం లేదు. గతంలో కూడా రెండు సార్లు వడ్డీ రాయితీ అవకాశం వచ్చినప్పటికీ చెల్లించలేదని దీంతో రెడ్ నోటీసులు జారీ చేసినప్పటికీ నేడు నీటి సరఫరా బంద్ చేసి, డ్రైనేజీ మూసివేసి మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి సిబ్బందితో ధర్నా చేశారు . ఈ ధర్నాలో మున్సిపల్ మేనేజర్ యాకూబ్ అలీ, వార్డు అధికారులు, ఆర్.పి లు పాల్గొన్నారు.

Similar News