ఉపాధి హామీ పనులపై అధికారుల ప్రజావేదిక.. బయటపడ్డ ఫీల్డ్ అసిస్టెంట్‌ల నిర్లక్ష్యం
ప్రజావేదికలో తప్పుల తడకగా మస్టర్ల నిర్వహణ, అదేవిధంగా ఫీల్డ్

దిశ, పెన్ పహాడ్ : ప్రజావేదికలో తప్పుల తడకగా మస్టర్ల నిర్వహణ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ ల నిర్లక్ష్య ధోరణి బయటపడ్డ వైనం. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం అడిషనల్ డీఆర్డీఓ శిరీష, ఎంపీడీవో జే .వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి ఉపాధి హామీ పనులపై ప్రజా దర్బార్ నిర్వహించారు. 1 ఏప్రిల్ 2023 నుండి 31 మార్చి 2024 వరకు మండలంలోని 29 గ్రామపంచాయతీలో 8 కోట్ల 71 లక్షల రూపాయల తో ఉపాధి హామీ పనులు చేసినట్లు అడిషనల్ డి ఆర్ డి ఓ శిరీష తెలిపారు. ఆ పనులను 21 మార్చి 2025 నుంచి 26 మార్చి 2025 వరకు అధికారుల బృందం సామాజిక తనిఖీ చేసినట్లు చెప్పారు.
చాలా చోట్ల మస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడం, కొట్టివేతలు, వైట్నర్ ఉపయోగించడం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. చాలాచోట్ల పాస్ ఆర్డర్లో ఎంపీడీవో సంతకం లేకుండానే పేమెంట్ లు చేసినట్లు గుర్తించామన్నారు. పేస్లిప్ పంపిణీ చేయకపోవడం, నో డిమాండ్ రాయకపోవడం, కాలిక్యులేషన్స్ లో తప్పులు దొర్లడం, గుర్తించామన్నారు. హరితహారం లో భాగంగా పెంచడం మొక్కల్లో 30% చనిపోయినట్లు గుర్తించామని ఆ మొక్కల స్థానంలో కొత్త మొక్కలను తిరిగి పెంచాలని సూచించారు. అవకతవకలు జరిగిన చోట రెండు రోజుల్లో సరిచేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రవి, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.