కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్న బంక్ వద్ద నిరసన..

స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ జరిగిన విషయం గుర్తించిన శోభన్ అనే యువకుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొజ్జ చిన్న మాదిగ, కొంతమందితో కలిసి బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

Update: 2024-06-27 17:16 GMT

దిశ, నిడమనూరు : స్థానిక హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ జరిగిన విషయం గుర్తించిన శోభన్ అనే యువకుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బొజ్జ చిన్న మాదిగ, కొంతమందితో కలిసి బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ బంక్ లో ఇలాంటి సంఘటన జరిగిందని, కల్తీ పెట్రోల్ వల్ల లక్షలు పెట్టి కొన్న వాహనాలు చెడిపోతున్నాయని, లాభాల కోసం బంక్ యాజమాన్యం కక్కుర్తి పడుతుందని, వెంటనే చర్యలు తీసుకొని బంక్ ను సీజ్ చేసి యజమాని పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న ఎస్సై గోపాల్ రావు, పోలీస్ సిబ్బందితో కలిసి వినియోగదారులతో మాట్లాడి ఆందోళన విరమింప చేశారు. తహసీల్దార్ జంగయ్య బంక్ యజమానిని పిలిపించి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిలుముల రాములు, చిత్రం శ్రీను, బొజ్జ ఏసు, వింజమూరు శోభన్, గన్నేపాక విజయ్, కందుల చంటి, బొజ్జ శేఖర్, నాని, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, డి.శ్రీను, కుమార్, కృష్ణ కుమార్, కోటి తదితరులు పాల్గొన్నారు.

Similar News