ముఖ్యమంత్రి వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి : Professor. Kodandaram
దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ - Professor Kodandaram demanded to implement the promises made by the Chief Minister to the displaced persons
దిశ, మర్రిగూడ: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా శివన్నగూడ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం బహిరంగ సభలో భూ నిర్వాసితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. మర్రిగూడ చౌరస్తాలో గురువారం కిష్టరాయన్ పల్లి, చర్లగూడెం భూ నిర్వాసితులు మూడో రోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షలో ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శిలాఫలకం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు నిర్మించేటప్పుడు భూ నిర్వాసితులకు బ్రతుకు తెరువును చూపిన తర్వాతనే ప్రాజెక్టును నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాల ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అమలు చేయకపోవడం దురదృష్టం అన్నారు. నిర్వాసితులకు భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, కోరుకున్నచోట ఇంటి స్థలం ఇస్తానని చెప్పి.. నేటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. దీక్ష చేస్తున్న కేశవులు గౌడ్ బీపీ షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే వారి న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశప్ప తో పాటు టీజేఎస్ నాయకులు వినయ్, శ్రీధర్, శ్రీనివాస్ భూనిర్వాసితులు సుమారు 100 మంది దీక్ష చేస్తున్న సభ్యులకు సంఘీభావం పలుకుతూ దీక్షలో కూర్చున్నారు.