మల్కాజ్ గిరి నుంచి నేను పోటీకి సిద్ధం : ఈటల

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తాను పుట్టింది కరీంనగర్ అయినప్పటికీ నా జీవితం మల్కాజ్ గిరి పరిసర ప్రాంతంలోనే గడిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-02-21 10:32 GMT

దిశ, యాదగిరిగుట్ట : అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. తాను పుట్టింది కరీంనగర్ అయినప్పటికీ నా జీవితం మల్కాజ్ గిరి పరిసర ప్రాంతంలోనే గడిచిందని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశం ఒకప్పుడు బాంబుల మోతలు, మత కలహాలతో ఉండేవని, కానీ మోదీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశం అంతా ప్రశాంతంగా ఉందన్నారు. విజయ సంకల్ప యాత్ర బుధవారం యాదగిరిగుట్టలో కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం పురోగతి సాధించిందని, మళ్లీ ఆదరించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు.

మోడీ ప్రభుత్వం వచ్చాక దేశంలో సమూల మార్పులను తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పని చేసినప్పుడు పింఛన్, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్, రైతుబంధు ఇచ్చి ప్రగల్భాలు . ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకుండా కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కుని చేశారని, అంతేకాకుండా కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ ఐదేళ్ల కాలంలో పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ ఒకటే దఫ్ఫా చేయాలంటే సాధ్యంగానే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని అన్నారు. ఉచిత బస్ పథకంతో బస్సులలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదని అన్నారు.



కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించి హాములను ప్రకటించారని, ఇప్పుడు అప్పుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నారని. గతంలో కేసీఆర్ జీతాలు ఇవ్వడానికే చాలా ఇబ్బందులు పడ్డాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలతో అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారని ఎద్దేవా చేశారు. హామీలు ఇవ్వకుండానే అమలు చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు. మూతబడిన రూ. 6,300 కోట్ల రూపాయల రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మోడీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది, నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతు పక్షపాతిగా నిలిచాడు అన్నారు. సౌత్‌కు 26 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్ మంజూరు అయిందని, ఎయిర్ పోర్ట్ స్థాయి సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైల్వే స్టేషన్లలో కల్పిస్తుందన్నారు.

ఇండియా కూటమితో కాంగ్రెస్ పార్టీ వస్తుందని, ఆ కూటమి అతుకుల బొంత, బ్లాక్ మెయిల్ పార్టీలతో నిండిపోయిందన్నారు. మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేదు అని మా సొంత కాళ్లపై నిలబడి పోటీ చేస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ పై సీబీఐ విచారణ చేపిస్తామని గెలిచాక మాట మార్చిందని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మేడిగడ్డ ఇష్యూ చేస్తుంది. నాగార్జునసాగర్, నిజం ప్రాజెక్టులు టెక్నాలజీ లేకుండా రాళ్లతో కట్టినవి బాగున్నాయని. కాళేశ్వరం పనికతమైపోయిందని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఆర్ఎస్పీ ఎండి పోతే తెలంగాణ ఎడారిగా మారుతుందని అని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కృష్ణాజిల్లాల పై కలిసి నాటకమాడుతున్నారని... బీజేపీని ఎదుర్కొనడానికి రెండు పార్టీలు ఈ నాటకాన్ని ఆడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాఘవుల నరేందర్, అశోక్ కుమార్, రంగ సత్యం తదితరులు పాల్గొన్నారు.


Similar News