సారా కేంద్రంపై పోలీసుల దాడులు

హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం, మేళ్లచెరువు,గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో.. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు.

Update: 2024-10-05 15:42 GMT

దిశ హుజూర్ నగర్ : హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం, మేళ్లచెరువు,గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో.. నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 26 లీటర్ల సారా తో పాటు.. 800 బెల్లం పానకంను ధ్వంసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రకుంట తండా కు చెందిన భూక్య వీర ఇంటి నుంచి 10 లీటర్ల సారా, 150 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మేళ్లచెరువు మండలంలోని వివిధ తండాలలో 250 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. గరిడేపల్లి మండలం రేగుల గడ్డ తండా కు చెందిన బానోతు కాంతమ్మ, తేజావత్ వెంకటమ్మ ఇంటి నుంచి ఎనిమిది లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మ నాయక్ తో పాటు..సివిల్ ఎస్సైలు అంతిరెడ్డి,రవీందర్,నరేష్, లక్ష్మీ నరసింహ, ఎక్సైజ్ ఎస్ఐలు దివ్య, వెన్నెల, జగన్మోహన్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది నాగయ్య,జయరాజ్, ధనుంజయ్,రవి, నాగమణి,బాలు,స్వాతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


Similar News