మా కొడుకే భూమిని దున్ననిస్తలేడు.. తల్లిదండ్రుల ఆవేదన

Update: 2024-08-12 13:51 GMT

దిశ, నేరేడుచర్లః సాధారణంగా భూమిని ఇతరులు ఆక్రమించుకున్న ఘటనలు వింటుంటాం. కానీ ఇది అంతకన్నా డిఫరెంట్. ఏకంగా కొడుకే వాళ్లను వ్యవసాయం చేసుకోనీయట్లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి చెందిన నెమ్మనీ బ్రహ్మయ్య భారతమ్మలకు పెన్ పహాడ్ మండలంలోని లింగాల రెవిన్యూ శివారులో బ్రహ్మయ్యకు 1.23 ఎకరాల భూమి ఉండగా అందులో తన కూతురికి వివాహ సమయంలో 20 గుంటల భూమి ఇచ్చారు. అలాగే తన కుమారుడు వెంకటేశ్వరులకు 23 గుంటల భూమిని ఇచ్చి తన వద్ద 20 కుంటల భూమిని ఉంచుకున్నాడు. భారతమ్మకు తల్లిగారు దాచారం గ్రామంలో వివాహ సమయంలో 20 గుంటల భూమి ఇవ్వగా ఆ భూమి భారతమ్మ పేరు మీదనే ఉంది. ఉన్న భూమి అంతా తనకే కావాలంటూ కొడుకు తమపై దాడులు చేస్తూ మా భూమి సేద్యం చేయకుండా అడ్డుపడుతున్నారని వాళ్లు కన్నీటి పరవంతమయ్యారు.

ఆ భూమిలో పంట వేద్దామని వెళ్తే తమపై దాడులు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. నా భూమితో పాటు నా కూతురు భూమిని కూడా చేయకుండా అడ్డుకుంటున్నాడని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా మా భూమిని సిద్ధం చేయకుండా అడ్డుకుంటున్నాడని ఆయనకు మేము ఇచ్చిన 23 కుంటల భూమిని మాత్రం ఆయన సేద్యం చేసుకుంటున్నాడని చెప్పారు. భూమి అంత ఆయనకే ఇస్తే మేము ఎలా బ్రతకాలనీ అంటున్నారు. తన కూతుర్ని కూడా భర్త వదిలేయడంతో ఆమె కూడా వచ్చి ఇక్కడే బతుకుతుందని ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. గతంలో పెద్ద మనుషుల సమక్షంలో చాలాసార్లు పంచాయతీ జరిగిందని పెద్ద మనుషులు కూడా ఎవరి భూమి వారు చేసుకోవాలని చెప్పారని ఆయన వినలేదని అన్నారు. కూలికి వెళ్లే పరిస్థితి కూడా లేదని మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

అతనితో మాట్లాడే ప్రయత్నం చేశాం .. తహసిల్దార్ సైదులు..

దాసారం గ్రామంలో ఉన్న అరెకరం భూమిని తన కొడుకు సేద్యం చేసుకోకుండా అడ్డుకుంటున్నాడని గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వారి భూమి అడ్డుకోకుండా ఉండాలని చెప్పేందుకు వారి కొడుకుకు ఫోన్ చేసి పిలిపించి మాట్లాడదామనే ప్రయత్నం చేశాను. కానీ అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

Tags:    

Similar News