దేశంలోనే రెండో అతిపెద్ద మారతాన్ లో గెలుపొందిన నల్గొండ వాసి

Update: 2024-08-25 13:48 GMT

దిశ, చిట్యాలః హైదరాబాదులో ఆదివారం నిర్వహించిన దేశంలోనే రెండో అతిపెద్ద మారతాను పరుగులో 42.2 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 45 నిమిషాల్లోనే పూర్తి చేసి విజయం సాధించాడె నల్గొండ వాసి. ఎక్సైజ్ ఎయిర్ పోర్ట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం వాసి రుద్రవరం అనిల్ ఈ ఫీట్ సాధించడంతో పలువురు సన్మానించారు. ఆరోగ్యంపై మక్కువ, ఇష్టంతో క్రమం తప్పకుండా ప్రతిరోజు రన్నింగ్ చేస్తూ, ప్రతి ఏటా హైదరాబాద్ సహా పలు నగరాల్లో నిర్వహించే పలు మారతాన్ లలో పాల్గొంటూ విజేతగా నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు పలు నగరాల్లో జరిగిన 42 కిలోమీటర్ల, 21 కిలోమీటర్ల మారతానులో పాల్గొని విజయం సాధించాడు. ఆదివారం హుస్సేన్ సాగర్ తీరాన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన మారథాన్ లో మొత్తం 25 వేలకు పై చిలుకు రన్నర్స్, 15 దేశాల నుంచి పాల్గొన్నారు.


Similar News