దిశ ఎఫెక్ట్ : కబ్జా నుండి ఐదు కోట్ల విలువ గల భూమికి విముక్తి..

నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని రామగిరిలో మోర్ సూపర్ మార్కెట్ గల్లీలో మొదటగా వచ్చే గల్లీ కబ్జాకు గురి అయ్యింది.

Update: 2023-04-22 14:34 GMT

దిశ, నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని రామగిరిలో మోర్ సూపర్ మార్కెట్ గల్లీలో మొదటగా వచ్చే గల్లీ కబ్జాకు గురి అయ్యింది. దాని విలువ సుమారు ఐదు కోట్లు పైగానే ఉంటుంది. అది మాములు కబ్జా కాదండోయ్ ఏకంగా బజారుకు రెండు వైపులా గేట్లు నిర్మించి మరి కబ్జా చేశారు. ఎవరికి అనుమానం రాకుండా మధ్యలో చెట్లను కూడా పెంచారు. ఈ విషయమై నల్లగొండలో బజాప్త బజారు కబ్జా అనే కథనంతో దిశ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి.రమణ స్పందించి వెంటనే ఆ భూమిని ఆధీనంలోకి తీసుకోవాలని అధికారులకు చెప్తే రోడ్డుకు ఒకవైపు మాత్రమే గేటు తీసివేసి కాలయాపన చేద్దాం అనుకున్నారు. అలాగే కబ్జా చేసిన వ్యక్తులు అక్కడికి వచ్చిన అధికారులకు కొంత మంది అధికార పార్టీ నాయకులతో ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఆ విషయమై కమిషనర్ సాబ్ జర దేఖో అనే కథనం దిశ మళ్ళీ తెరమీదకు తీసుకువచ్చింది.

కబ్జా నుండి ఐదు కోట్ల విలువ గల భూమికి విముక్తి..

నల్లగొండ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కెవి.రమణ తనదైన శైలితో ప్రభుత్వ భూములు, మున్సిపల్ భూములు కాపాడాలనే కోణంతో రెండు గేట్లు తొలగించారు. దాదాపు వెయ్యి గజాల స్థలం సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. కానీ గేటు దిమ్మలు అలానే ఉంచారు. మరి దింట్లో ఏమైనా కుట్ర కోణం దాగిఉంద ? లేక ఆ గల్లీ మొత్తం వాడుకలోకి వస్తుందా ? వేచి చూడాలి. ఈ విషయమై అక్కడి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆ గల్లీని పూర్తిగా వాడుకలోకి తేవాలని సీసీ రోడ్డు నిర్మాణము చేపట్టాలని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్నారు.

దిశకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రజలు..

గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ కబ్జాకు గురి అయిన భూమిని మున్సిపాలిటీ ఆధీనంలోకి తీసుకరావడానికి ముఖ్యపాత్ర "దిశ" పోషించిందని, సుమారు ఐదు కోట్ల రూపాయల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడింది దిశ నే అని అక్కడి వారు అన్నారు.

Tags:    

Similar News